మరాఠా ఎన్నికల ప్రచారంలో పవన్ స్టార్
ఎన్డీయే కూటమి తరపున క్యాంపెయిన్
అమరావతి – ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కు అరుదైన అవకాశం దక్కింది. ప్రధానమంత్రి మోడీ ప్రత్యేకంగా అభినందించారు పవన్ ను. ఇదిలా ఉండగా ప్రస్తుతం జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు హోరా హోరీగా సాగుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్ , అమిత్ చంద్ర షా, నితిన్ గడ్కరీ తో పాటు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే ప్రచారం చేపట్టారు.
కూటమి తరపున ప్రచారం చేపట్టేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన నవంబర్ 16, 17 తేదీలలో రెండు రోజుల పాటు మరాఠాలో జరిగే ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటారు. తన వాయిస్ ను వినిపించే ప్రయత్నం చేస్తారు కొణిదల పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.