మార్చి 30 నుంచి ప్రచారం
అమరావతి – ఏపీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. మార్చి 30 నుంచి తాను బరిలో నిలిచే పిఠాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. ట్విట్టర్ వేదికగా మంగళవారం తెలియ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రజలతో మమేకం కావడానికి ప్లాన్ చేసినట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీతో కలిసి కూటమిగా ఏర్పాటయ్యాయి. ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టడం జరుగుతుందని తెలిపింది జనసేన పార్టీ.
ఆరు నూరైనా సరే జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు జనం సిద్దమై ఉన్నారని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల పేరుతో మోసం చేసిన ఘనత సీఎందేనని ఎద్దేవా చేశారు.
తమ కూటమికి పక్కాగా 170కి పైగా స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ స్థానాలలో కనీసం 22కు పైగా వస్తాయని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.