అవకతవకలపై విచారణ తప్పదు
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్
అమరావతి – గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆర్థిక అరాచకత్వానికి హద్దు లేకుండా పోయిందని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన పలు శాఖలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లకు పనులు ఎలా అప్పగిస్తారంటూ ప్రశ్నించారు.
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏడాదిన్నరగా జీతాలు కూడా చెల్లించక పోవడం దారుణమన్నారు. ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైసీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఆందోళన కలిగిస్తోందన్నారు.
బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఏ మేరకు చెల్లించారో నివేదిక ఇవ్వండి అంటూ పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కచ్చితంగా ప్రతి శాఖలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపుపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు .
సమీక్ష సమావేశంలో ప్రధానంగా ఇంజినీరింగ్ విభాగం మొదలు పెట్టిన రోడ్లు, వంతెనల పనులు, వాటికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బంక్ (ఏఐఐబీ) నుంచి సమీకరించిన రుణం.. వాటి వినియోగంపై కూలంకుషంగా చర్చించారు పవన్ కళ్యాణ్.