అక్రమ బియ్యం రవాణాపై పవన్ ఫైర్
ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారంటూ
అమరావతి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అక్రమంగా బియ్యం రవాణపై కాకినాడ పోర్టును తనిఖీ చేశారు. విచారణ చేపట్టాలని ఆదేశించారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు బియ్యం తరలించేందుకు సిద్దంగా ఉన్న 1064 టన్నుల బియ్యం సంచులను నిలిపి వేయాలని స్పష్టం చేశారు. బహిరంగంగానే బియ్యం అక్రమంగా తరలి పోతుంటే ఏం చేస్తున్నారంటూ సంబంధిత అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్.
ఈ సందర్బంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా అంశంపై వివరించారు. రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ళ దూరంలో రవాణా కు సిద్ధమై వెళుతున్న స్టెల్లా ఎల్ పనామా షిప్ ను పట్టుకున్నారని తెలిపారు.
ఇందులో దాదాపు 640 టన్నుల బియ్యాన్ని స్వయంగా పరిశీలించారు పవన్ కళ్యాణ్. ఇటీవల పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ ఆధ్వర్యంలో అక్రమ బియ్యం తరలింపును అడ్డుకొని పోర్టులోనే ఉంచారు అధికారు.
కాకినాడ పోర్ట్ నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే తమాషా చేస్తున్నారా అని మండిపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం.