పోటీపై పవన్ కళ్యాణ్ ఫోకస్
విశఖ లేదా రాజమండ్రి లో పోటీ
అమరావతి – రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడిని రాజేస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల శంఖారావాన్ని పూరించాయి. శాసన సభ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 175 సీట్లకు గాను అధికారంలో ఉన్న వైసీపీ ఫోకస్ పెట్టింది. చాలా స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు ఆ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి.
ఇదే సమయంలో ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం , జనసేన పార్టీలు కూటమిగా ఏర్పాటు అయ్యాయి. మరో వైపు బీజేపీ సైతం జనసేన తో పొత్తు కలిగి ఉన్నట్లు పదే పదే ప్రకటిస్తూ వస్తోంది బీజేపీ. ఈ విషయాన్ని కుండ బద్దలు కొట్టారు ఆ పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి.
తాజాగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు 175 సీట్లకు గాను 99 సీట్లకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి బరిలో ఉంటారనేది ఇంకా కొలిక్కి రాలేదు.