NEWSANDHRA PRADESH

జ‌న సేనానికి బ్ర‌హ్మ‌ర‌థం

Share it with your family & friends

భీమ‌రం జ‌న సంధ్రం
అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అడుగ‌డుగునా నీరాజ‌నం ల‌భిస్తోంది. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నారు. నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అడుగులో అడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌రిగే శాస‌న స‌భ‌, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేయ‌నున్నాయ‌ని ప్ర‌క‌టించారు జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. వైసీపీ పాల‌నకు జ‌నం ఘోరీ క‌ట్ట‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. త‌మ గెలుపును అడ్డుకోవ‌డం ఎవ‌రి త‌రం కాద‌న్నారు .

టీడీపీ, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ క‌లిసి పోటీ చేస్తే గెలుపొంద‌డం ప‌క్కా అని జోష్యం చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అంత‌కు ముందు జ‌న‌సేన పార్టీ ఆధ్వ‌ర్యంలో భారీ ర్యాలీ చేప‌ట్టారు. జ‌య జ‌య ధ్వానాల‌తో జ‌న‌సేనానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

వీధుల వెంట బారులు తీరారు జ‌నం . ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభివాదం చేశారు. అనంత‌రం టీడీపీ, బీజేపీ నేత‌ల‌తో మ‌ర్యాద పూర్వ‌కంగా భేటీ అయ్యారు జ‌న‌సేనాని.