మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా మూవీ రెడీ
హైదరాబాద్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో నటించిన హరి హర వీరమల్లు మూవీకి సంబంధించి అప్ డేట్ వచ్చేసింది. తను స్వయంగా పడిన మాట వినాలి సాంగ్ ను మూవీ మేకర్స్ ఇవాళ విడుదల చేశారు. ఈ సినిమాకు దివంగత సిరి వెన్నెల సీతారామ శాస్త్రితో పాటు గేయ రచయిత చంద్రబోస్ పాటలు రాశారు. ఆస్కార్ విజేత , స్వరకర్త ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. జాగర్లమూడి క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
హరి హర వీరమల్లు చారిత్రిక నేపథ్యంతో కూడిన సినిమాగా తెరకెక్కుతోంది. భారీ ఎత్తున నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని. మనసు పెట్టి తీస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తో పాటు నిధి అగర్వాల్ , బాబీ డియోల్ , ఎం. నాసర్, సునీల్ , రఘుబాబు, సుబ్బరాజు, బాలీవుడ్ యాక్టర్ నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఎంఎం రత్నం సమర్పిస్తుండగా ఎ. దయాకర్ రావు హరి హర వీరమల్లును నిర్మిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రపంచ వ్యాప్తంగా వచ్చే మార్చి 28న విడుదల కానుంది ఈ సినిమా. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు.
చాలా గ్యాప్ తర్వాత పవర్ స్టార్ నుంచి సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రంపై.