NEWSANDHRA PRADESH

వ‌న మ‌హోత్స‌వం ఏపీకి హ‌రిత‌హారం

Share it with your family & friends

ప‌చ్చ‌ద‌నంతో రాష్ట్రం క‌ళ‌క‌ళ లాడాలి

అమ‌రావ‌తి – వ‌న మ‌హోత్స‌వంలో ప్ర‌తి ఒక్క‌రు పాల్గొనాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ప‌చ్చ‌ద‌నంతో క‌ళ క‌ళ లాడాల‌ని పిలుపునిచ్చారు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్. రాష్ట్రంలో చేప‌ట్టే వ‌న మ‌హోత్సవ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. దీనిని సామాజిక బాధ్య‌త‌గా తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు.

శుక్ర‌వారం నుంచి రాష్ట్ర మంత‌టా వ‌న మ‌హోత్స‌వ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. పచ్చదనంతో రాష్ట్రమంతా కళకళ లాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 శాతం మాత్రమే పచ్చదనం ఉందని, విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం ద్వారా, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో 50 శాతానికి పచ్చదనం పెరగాలని అన్నారు.

మొక్కల పెంపకం అనేది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేది కాదని, ప్రతి ఒక్కరూ తమకు అనువైన ప్రదేశాల్లో మొక్కలను నాటి, వాటి పెరుగుదలకు తగిన బాధ్యత తీసుకోవాలని కోరారు డిప్యూటీ సీఎం.

మొక్కల జాతుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. దేశీయ జాతులను ఎంపిక చేసుకోవాలని అన్నారు. స్థానిక వృక్ష జాతులకు చెందిన మొక్కలు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడవచ్చని తెలిపారు.

పర్యావరణ సమతుల్యత, మానవ ఆరోగ్యాన్ని కాపాడినవాళ్లం అవుతామ‌ని పేర్కొన్నారు. మన దేశ భౌగోళిక పరిస్థితులకు విరుద్ధంగా ఉండే, అన్య జాతుల మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చ‌రించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, అస్సాం ప్రభుత్వాలు సైతం కోనోకార్పస్ ను నిషేధించాయ‌ని తెలిపారు. కోనోకార్పస్ వల్ల జరిగే అనర్థాలు అధికంగా ఉన్నాయ‌ని, భూగర్భ జల సంపదను ఎక్కువగా వినియోగించు కోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్న వారికి శ్వాస సంబంధ సమస్యలు వస్తాయ‌ని తెలిపారు.