నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్
అమరావతి – ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి ఇవాళ. గత ఏడాది గుండె పోటుతో తనువు చాలించారు. ఆయన మరణం కోట్లాది మందిని కన్నీటి పర్యంతం అయ్యేలా చేసింది. తన ఆట పాటలతో చైతన్యం చేయడంలో కీలక పాత్ర పోషించారు. తన జీవితమంతా ప్రజల కోసం పాడాడు. తన జీవితమే ఓ పోరాటమని ఆయన పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు.
తను ఎన్నో అవమానాలు ఎదుర్కొని ,చివరకు దాడికి గురై, శరీరంలో తూటాను పెట్టుకుని బతికిన ఏకైక ప్రజా గాయకుడు, వాగ్గేయకారుడు, కోట్లాది మంది ప్రేమించే దిగ్గజం గద్దర్. ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. తను చిన్నతనం నుంచే ఆయన పాటలు వింటూ పెరిగానని తెలిపారు.
గద్దరన్నతో సాన్నిహిత్యం మరిచి పోలేనని, తనతో ఉన్న ప్రతి క్షణం తనకు ప్రత్యేక మైనదని ఈ సందర్బంగా పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గద్దరన్నకు హృదయ పూర్వకమైన నివాళి అని తెలిపారు.