రాష్ట్ర ప్రగతి కోసం గొంతు విప్పండి
ఎంపీలకు పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదెల కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రగతి కోసం , మానవ వనరుల అభివృద్ది కోసం పార్లమెంట్ లో ఎంపీలు చర్చించాలని సూచించారు. ఎన్డీఏ కూటమి, జనసేన పక్షాన మాట్లాడాలని స్పష్టం చేశారు.
ఆలయాలు, దర్శనీయ స్థలాలకు సంబంధించి పర్యాటక ప్రాంతాలుగా మార్చేందుకు తమ వంతుగా ప్రయత్నం చేయాలని, ఇందుకు సంబంధించి ఎంపీలకు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జార విడుచు కోవద్దంటూ పేర్కొన్నారు కొణిదెల పవన్ కళ్యాణ్.
ఇదిలా ఉండగా ప్రతి నెలా ఒక రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఇది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందన్నారు. జనసేన ఎంపీలకు జనసేన పార్టీ చీఫ్ దిశా నిర్దేశం చేయడం విశేషం.
తనకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. ఎవరైనా ఏ పార్టీకి చెందిన వారైనా తనను వ్యక్తిగతంగా కలవవచ్చని చెప్పారు పవన్ కళ్యాణ్.