NEWSANDHRA PRADESH

అసెంబ్లీ వ్య‌వ‌హారాల‌పై దృష్టి పెట్టాలి

Share it with your family & friends

పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి – శాస‌న స‌భ అనేది అత్యంత కీల‌కం. దానిని మ‌నం ఓ దేవాల‌యంగా భావించాలి. అలా అయితేనే మ‌నం అనుకున్న‌ది చేయ‌గ‌ల‌మ‌ని గుర్తించాల‌ని స్ప‌ష్టం చేశారు జ‌న‌సేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కళ్యాణ్ కొణిదెల.

మంగ‌ళ‌వారం పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌న‌సేన పార్టీ త‌ర‌పున తాజాగా జ‌రిగిన శాస‌న స‌భ‌, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో గెలుపొందిన ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. 21 ఎమ్మెల్యేలు 2 లోక్ స‌భ స‌భ్యులు విజ‌యం సాధించారు.

ప్ర‌ధానంగా శాస‌న స‌భ అనేది అత్యంత కీల‌కం. ఎలా వ్య‌వ‌హ‌రించాలి. ఏమేం ప్ర‌శ్న‌లు అడ‌గాలి. స‌భ్య‌త‌తో , విజ్ఞ‌త‌తో ఎలా మాట్లాడాలి అనే దానిపై శిక్ష‌ణ ఇచ్చారు. ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని గ‌తంలో ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రానికి స్పీక‌ర్ గా ప‌ని చేసిన రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ ప్రారంభించారు. ఎమ్మెల్యేల‌కు అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడారు.

అసెంబ్లీ వ్య‌వ‌హారాలు అత్యంత కీల‌క‌మైన‌వ‌ని, వాటిపై అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని సూచించారు.