Sunday, April 20, 2025
HomeNEWSANDHRA PRADESHస్వచ్ఛత..శుభ్రత జీవన విధానం కావాలి

స్వచ్ఛత..శుభ్రత జీవన విధానం కావాలి

పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి – స్వ‌చ్ఛ‌త‌, శుభ్ర‌త ప్ర‌జ‌ల జీవ‌న విధానం కావాల‌ని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప్ర‌తి ఇంటి నుంచి చెత్త ర‌హిత స‌మాజం ఆలోచ‌న పుట్టాల‌న్నారు. స్థానిక సంస్థలు సైతం చెత్త వినియోగం మీద ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. ప్రతి నెలా మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’ పక్కాగా నిర్వహించాలన్నారు. వికసిత్ భారత్ లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామ‌న్నారు.

గుంటూరు జిల్లా నంబూరులో చేపట్టిన ‘స్వచ్ఛ ఆంధ్రా – స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు ప‌వ‌న్ క‌ల్యాణ్. కేవలం పారిశుద్ధ్య కార్మికులకో, క్లాప్ మిత్రలకో మాత్రమే బాధ్యత ఉంది అనుకోవద్దన్నారు.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, స్వచ్ఛతను కాపాడటం అనేది మన అందరి బాధ్యత అని స్ప‌ష్టం చేశారు. ఆయనతో పాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు.

పంచాయతీల పరిధిలో చేస్తున్న స్వచ్ఛత కార్యక్రమాలు, డంపింగ్ యార్డులు, చెత్తను వేరు చేసే క్రమం వంటి విషయాలను స్వయంగా పంచాయతీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం చెత్తను సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో కలిసి మొక్కలను నాటారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments