NEWSANDHRA PRADESH

ప‌ర్యావ‌ర‌ణ ర‌హిత ట‌పాకాయ‌లు వాడాలి

Share it with your family & friends

పిలుపునిచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్
అమ‌రావ‌తి – దీపావ‌ళి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఏపీ ఉప ముఖ్య‌మంత్రి కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్. పండుగ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు . పర్యావరణహిత టపాకాయలకు పెద్దపీట వేస్తూ దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

విజయనగరం జిల్లా గుర్లలో డయేరియాకు సంబంధించి తాజా పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం డయేరియా కేసుల నమోదు తగ్గిందని పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు హోంమంత్రి వెల్లడించారు.

ఇటీవల రాష్ట్రంలో విమానాలలో బాంబు బెదిరింపుల పైనా హోంమంత్రిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన రాష్ట్రంలోని అరాచక పరిస్థితులు ఇటీవల బయటికి వస్తున్న దుర్మార్గాలపై చట్టప్రకారం వేగంగా దర్యాప్తు చేసి, నిందితులను శిక్షించేలా చూడాలని ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నిర్వహణ పట్ల డిప్యూటీ సీఎం ప్రశంసలు కురిపించారు. నేరాల నియంత్రణలో మొబైల్ ఫోన్ వినియోగించాలని హోంమంత్రి ప్రజల భాగస్వామ్యం కోరడాన్ని అభినందించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

డ్రగ్స్, గంజాయి,సైబర్ నేరాల పట్ల గతంలో లేని విధంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నట్లు వెల్ల‌డించారు . పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను ఉప ముఖ్యమంత్రికి వివరించారు.

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో లింగాపురం నుంచి కొడవటిపూడి కట్ట వరకు సుమారు కి.మీ మేర నిర్మించనున్న ఆర్ అండ్ బీ రోడ్డుకు అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలని కోరారు వంగ‌ల‌పూడి అనిత‌.