జనసేనాని పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీలో త్వరలో జరిగే శాసన సభ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. ప్రతి అడుగులో గెలుపు కనిపిస్తోందని అన్నారు.
చారిత్రాత్మకమైన పొత్తు ప్రకటించింది రాజమండ్రిలో నేనని చెప్పారు. ఈ ప్రాంతంలో మనదైన ముద్ర ఉండాలన్నారు పవన్ కళ్యాణ్. కాపుల ప్రాబల్యం ఉన్న జిల్లాకు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి రిజర్వేషన్ ఇచ్చేది లేదంటూ మోసం చేశారని ఆరోపించారు . అధికారంలోకి వచ్చాక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఉన్న 5 శాతం కూడా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
పచ్చటి కోన సీమలో కావాలని చిచ్చు పెట్టారంటూ మండిపడ్డారు పవన్ కళ్యాణ్. వైసీపీ మళ్లీ గనుక అధికారంలోకి వస్తే గోదావరి జిల్లా ఆగమాగమై పోతుందని ఆవేదన చెందారు. ఇకనైనా రాష్ట్ర ప్రజలు ప్రధానంగా కాపులు ఈ వాస్తవాన్ని గుర్తించాలని, లేక పోతే ప్రమాదం నెలకొనే ఛాన్స్ ఉందన్నారు పవన్ కళ్యాణ్.
ఇదిలా ఉండగా రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమావేశంలో జనసేనాని ప్రసంగించారు.