డిప్యూటీ సీఎం ..జనసేన చీఫ్ పవన్
అమరావతి – సైద్ధాంతిక పోరాటమే జనసేన పార్టీ బలమని అన్నారు డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. ప్రజలకు మేలు చేసే మార్పును జనసేన కోరుకుంటుందన్నారు. దేశ గతిని మార్చే యువ నాయకత్వాన్ని అందించడమే తన కల అని పేర్కొన్నారు. సనాతన ధర్మం అంటే సమాజంలో అందరికీ మేలు జరగాలని కోరుకోవడమేనని అన్నారు. దేశంలో బహు భాషల అవసరం ఉందని స్పష్టం చేశారు. ఉత్తరాది, దక్షిణాది అని పదేపదే మాట్లాడటం సబబు కాదన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ అవసరమని స్పష్టం చేశారు. దేశాన్ని ముక్కలు చేసే ఆలోచనలు తప్పు అని అన్నారు.సెక్యూలరిజం పేరుతో ఒక్కోక్కరికి ఒక్కో న్యాయం అంటే ఎలా అని ప్రశ్నించారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ జయకేతనం ఆవిర్భావ సభలో ప్రసంగించారు జనసేనాని. రుద్రవీణ వాయిస్తా, అగ్నిధార కురిపిస్తా, తిరుగుబాటు జెండా ఎగురేస్తా, దుష్ట పాలన నుంచి విముక్తి కలిగిస్త అన్న తెలంగాణ ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య పంక్తులే జనసేనకు బలమని చెప్పారు పవన్ కళ్యాణ్. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని తొడలు కొట్టిన వారిని ఎదురించి వంద శాతం స్ట్రైక్ సాధించడమే తమ లక్ష్యమన్నారు.
బలమైన భావజాలం, గొప్ప సిద్ధాంతాలతో ప్రయాణం మొదలుపెట్టి ప్రజలకు తాము అండగా నిలుస్తామని భరోసా నింపిన గొప్ప ధైర్యం జనసేన పార్టీదని అన్నారు. చాలా మంది ఢిల్లీ స్థాయి జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ లెఫ్టిస్టు, రైటిస్టు, సెంట్రిస్టు అని పదేపదే రకరకాలుగా రాస్తున్నారు. నేను ఒకటే చెప్పదల్చుకున్నా. నేను చెగువేరాను ప్రేమిస్తా.. నారాయణ గురును గౌరవిస్తా. నేను లోకమాన్య బాలగంగాధక్ తిలక్ కు నమస్కరిస్తా.. జయప్రకాశ్ నారాయణ్ భావజాలం అభిమానిస్తా.. మదర్ థెరిసాకు మొక్కుతా… భగత్ సింగ్ ను గుండెల్లో పెట్టుకుంటా అని ప్రకటించారు.