స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్
అమరావతి – తన సినిమా ఓజీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఓజీ అంటే ఒరిజనల్ గ్యాంగ్ స్టర్ అని స్టోరీ లైన్ వెల్లడించారు. ఈ సినిమా కథ 1980, 1990లో జరిగిన కథ అన్నారు. అన్ని సినిమాలకు తాను డేట్స్ ఇవ్వడం జరిగిందన్నారు. కానీ సద్వినియోగం చేసుకోలేదని బాంబు పేల్చారు. ఇక హరిహర వీరమల్లు ఎనిమిది రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉందన్నారు.
ఇప్పటి వరకు తాను ఒప్పందం చేసుకున్న సినిమాలను ఒక్కొక్కటి పూర్తి చేస్తానని చెప్పారు. సోమవారం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. తాను సినిమాలకు సంబంధించి జయాపజయాల గురించి పట్టించుకోనని స్పష్టం చేశారు .
తనపై ఎన్నో అంచనాలు ఉన్నాయని, తనపై ఆధారపడిన వారు వేలాది మంది ఉన్నారని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. తాజాగా జరిగిన ఎన్నికల్లో తాను ప్రచారం చేయడం వల్ల షూటింగ్ లకు సంబంధించి ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు.