లడ్డూ ప్రసాదంపై పవన్ స్పందన
జంతువుల కొవ్వు కలపడం బాధాకరం
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా తిరుమల ప్రసాదంపై చోటు చేసుకున్న చర్చకు తెర దించే ప్రయత్నం చేశారు.
ఈ మొత్తం వ్యవహారంపై ఆయన లేటుగా స్పందించడం విశేషం. కోట్లాది మంది భక్తులు నిత్యం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని , ఈ విషయంలో లడ్డూ ప్రసాదాన్ని భక్తితో , తన్మయత్వంతో స్వీకరిస్తారని తెలిపారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం బాధా కరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ కొణిదెల.
దేశంలోని దేవాలయాల సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయకుండా ఉండేలా మనమంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం.
బోర్డు ఏర్పాటుపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు కొణిదెల పవన్ కళ్యాణ్.