DEVOTIONAL

తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ బాధాక‌రం – డిప్యూటీ సీఎం

Share it with your family & friends

మ‌రింత ఆవేద‌న‌కు గురి చేసింద‌న్న ప‌వ‌న్

గుంటూరు జిల్లా – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయ‌న గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ప్రాయ‌శ్చిత దీక్ష‌కు పూనుకున్నారు. అంత‌కు ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల మీడియాతో మాట్లాడారు.

తిరుపతి లడ్డు లో కల్తీ జ‌రిగింద‌న్న విష‌యం హిందువులందరిని ఆవేదనకు గురి చేసింద‌న్నారు డిప్యూటీ సీఎం. అందులో వాస్తవం ఏందో తేలాల్సిందేన‌ని పేర్కొన్నారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు జ‌ర‌గ‌డంతో తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామిని న‌మ్ముకున్న భ‌క్తుల‌కు ఇబ్బందిక‌రంగా మారింద‌న్నారు. దేవుని పైన ఉండే విశ్వాసం, తిరుమలకు ఉండే ప్రాశస్త్యం దెబ్బతినే అవకాశం ఉందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు డిప్యూటీ సీఎం.

దీన్ని రాజకీయ అంశంగా మల్చకుండా, సంయమనం పాటించడం మంచిదని సూచించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆశ్రయం ఇచ్చిన స్వామి వారికి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించ‌క పోవ‌డం టీటీడి లో పనిచేస్తున్న హిందువులు చేసిన తప్పు అని అన్నారు.