NEWSANDHRA PRADESH

ప‌నుల‌తో ప‌ల్లెలు క‌ళ‌క‌ళ లాడాలి – ప‌వ‌న్ క‌ళ్యాణ్

Share it with your family & friends

అభివృద్దికి కేరాఫ్ గా మారాల‌ని పిలుపు

అమ‌రావ‌తి – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలోని ప‌ల్లెల‌న్నీ అభివృద్దికి కేరాఫ్ గా మారాల‌ని స్ప‌ష్టం చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులను పండుగలా మొదలు పెట్టాలని పిలుపునిచ్చారు.

అక్టోబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ప్రతి పల్లెలో పనులకు శ్రీకారం చుట్టాల‌ని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం. 15వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ పథకం నిధులు సద్వినియోగం చేసుకోవాల‌ని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ఇదిలా ఉండ‌గా రాష్ట్ర పంచాయ‌తీ రాజ్ , గ్రామీణాభ‌వృద్ది శాఖ అధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు . ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం గ్రామాల అభివృద్దిపై దృష్టి సారించామ‌న్నారు.

గ‌తంలో కొలువు తీరిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ప‌ల్లెల‌ను పూర్తిగా విస్మ‌రించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్. గ్రామాల‌లో మౌళిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌కు కృషి చేస్తామ‌న్నారు .