NEWSANDHRA PRADESH

చెత్త‌తో రూ. 220 కోట్ల ఆదాయం

Share it with your family & friends

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి – ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల‌నా ప‌రంగా దూకుడు పెంచారు. ఆయ‌న నిత్యం త‌న శాఖ‌ల‌పై స‌మీక్ష‌లు చేప‌డుతున్నారు. ఉన్న‌తాధికారుల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ స్వంతం చేసుకున్న డిప్యూటీ సీఎం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

శుక్ర‌వారం ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యంపై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేయ‌డం విశేషం. రాష్ట్రంలో ప్ర‌జ‌లు చెత్తను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వేయ కూడ‌ద‌ని సూచించారు. ప‌నికి రాద‌ని అనుకున్న చెత్త‌తో భారీగా ఆదాయాన్ని పొందేందుకు వీలుంద‌ని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రూ భాగ‌స్వామ్యం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. చిత్త శుద్దితో చెత్త ప‌ట్ల అవ‌గాహ‌న క‌లిగి ఉంటే నెల‌కు దాదాపు రూ. 220 కోట్లు సంప‌ద సృష్టించేందుకు వీలుంద‌ని చెప్పారు కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్.

అంటే సంవ‌త్స‌రానికి క‌నీసం రూ. 2, 643 కోట్ల‌కు పైగా ఆదాయం రాష్ట్రానికి కేవ‌లం చెత్త కార‌ణంగా ల‌భిస్తుంద‌ని తెలిపారు. ఓ వైపు సంప‌ద‌ను పోగేసు కోవ‌డంతో పాటు కాలుష్యాన్ని కూడా నివారించ వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం.