జాతీయ మీడియా వెల్లడి
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మార బోతున్నాయా. అవుననే అంటున్నాయి జాతీయ మీడియా సంస్థలు. ఇప్పటికే తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఊహించని రీతిలో 10 ఏళ్ల దొరల పాలనకు ప్రజలు మంగళం పాడారు.
ఈ తరుణంలో కేసీఆర్, జగన్ రెడ్డి దోస్తులుగా వ్యవహరించారు. ప్రధానంగా కృష్ణా, గోదావరి నీళ్లను దౌర్జన్యంగా మళ్లించుకునేలా చేశారంటూ ప్రస్తుత సర్కార్ ఆరోపణలు చేస్తోంది. ఈ సమయంలో ఏపీలో పూర్తిగా నెగటివ్ ధోరణి ప్రజల్లో నెలకొందన్న భావన వ్యక్తం అవుతోంది.
ప్రస్తుతం ఏపీలో శాసన సభ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇక వైసీపీ వై నాట్ 175 అనే నినాదంతో ప్రచారంలోకి వెళుతోంది. ప్రధానంగా జాతీయ స్థాయిలో మీడియా తో పాటు పలు సర్వే సంస్థలు పూర్తిగా జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉందని ఫలితాలు తారుమారు కాబోతున్నాయని పేర్కొంటున్నాయి.
ఈ సమయంలో తాజాగా ప్రముఖ ఆంగ్ల మీడియా అవుట్ లుక్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కీలకమైన ప్రభావితం చూపనున్నట్లు పేర్కొంది.