ఏపీ పాలిటిక్స్ లోపవన్ కీలకం
స్పష్టం చేసిన జన సైనికులు
అమరావతి – ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోంది పోటీ. ఆయా పార్టీలకు చెందిన నేతలు మాటలకు పదును పెట్టారు. ఒకరిపై మరొకరు తూటాలు పేల్చుతున్నారు. త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది.
ఈ తరుణంలో ఏపీలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ , జై భారత్ పార్టీలు బరిలో ఉండనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆద్వర్యంలోని వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఎలాగైనా సరే రెండోసారి రావాలని జగన్ వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు. మరో వైపు ఏపీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ కీలకంగా మారనుంది. ఆయా పార్టీలకు సంబంధించి విజయావకాశాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నారు.
ఈ విషయాన్ని జన సైనికులు కుండ బద్దలు కొట్టడం విస్తు పోయేలా చేసింది. ఏపీలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లను ప్రజలు పట్టించు కోవడం మానేశారంటూ స్పష్టం చేశారు.