చంద్రబాబుతో పవన్ భేటీ
19, 20 తేదీల్లో ఢిల్లీకి పయనం
అమరావతి – ఏపీలో త్వరలో శాసన సభ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో తెలుగుదేశం, జనసేన , భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఈసారి ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించారు. ఇప్పటికే దాదాపు సీట్ల ఖరారుపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వేర్వేరుగా ఢిల్లీకి వెళ్లారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ట్రబుల్ షూటర్ అమిత్ చంద్ర షాతో కలిసి వచ్చారు. ఈ సందర్బంగా అసెంబ్లీలో పోటీ చేసే 175 సీట్లకు సంబంధించి సీట్ల పంపకంపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా శనివారం ఉన్నట్టుండి జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.
ఈ సందర్బంగా వీరిద్దరూ గంటకు పైగా సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాజకీయాలన్నీ వీరిద్దరి మధ్యే కొనసాగుతున్నాయి. మరో వైపు వై నాట్ 175 అనే నినాదంతో వైసీపీ బాస్, సీఎం జగన్ మోహన్ రెడ్డి దూకుడుతో ఉన్నారు. మరోసారి తాము ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు. మొత్తంగా పవన్ , బాబు భేటీ వెనుక ఏమై ఉంటుందనేది వేచి చూడాలి.