NEWSANDHRA PRADESH

చంద్ర‌బాబుతో ప‌వ‌న్ భేటీ

Share it with your family & friends

సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపిన నేత‌లు

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడుతో జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బుధ‌వారం ఆయ‌న నివాసంలో క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఇరువురి మ‌ధ్య చ‌ర్చ‌లు కొన‌సాగాయి. రాష్ట్రంలో ఎలాగైనా స‌రే కూట‌మి ప‌వ‌ర్ లోకి తీసుకు వ‌చ్చేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు.

ప్ర‌ధానంగా రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగిస్తున్న వైసీపీ బాస్, సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఇంటికి సాగ‌నంపేందుకు ప్ర‌తి ఒక్క‌రు న‌డుం బిగించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌రో వైపు భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తు ఉంటుందా అనేది తేలాల్సి ఉంది.

ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు , ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి ఢిల్లీకి వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా పొత్తుకు సంబంధించి బీజేపీ వేచి చూసే ధోర‌ణి అవ‌లంభిస్తోంది. త్వ‌ర‌లో ఏపీలో ఇటు శాస‌న స‌భ అటు పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

బ‌ల‌మైన జ‌గ‌న్ ను ఢీకొట్టాలంటే ఇరు పార్టీల‌కు చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణులు క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్. వీరిద్ద‌రి భేటీ ప్ర‌స్తుతం ఏపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.