గజేంద్రతో పవర్ స్టార్ భేటీ
బై జయంత్ పండాతో చర్చలు
న్యూఢిల్లీ – హస్తినలో బిజీగా ఉన్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. ఈసారి ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయనున్నారు. కానీ ఊహించని రీతిలో ఈ రెండు పార్టీలతో కలిసి భారతీయ జనతా పార్టీ పొత్తు కుదుర్చుకుంది. ఈ పొత్తు కలిసేలా చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు జనసేనాని పవన్ కళ్యాణ్.
ఆయన గత కొన్నేళ్లుగా బీజేపీలో టచ్ లో ఉన్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకు ఏది చెబితే అది చేస్తూ వస్తున్నారు. ఓ వైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరో వైపు ఫుల్ టైమ్ రాజకీయాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన గత కొంత కాలం నుంచీ వైసీపీని, సీఎం జగన్ మోహన్ రెడ్డిని, ఆయన పరివారాన్ని ఏకి పారేస్తూ వస్తున్నారు.
అయితే తాజాగా జాతీయ సర్వేలన్నీ గంప గుత్తగా జగన్ రెడ్డికి ఫలితాలు వ్యతిరేకంగా రానున్నాయని చెబుతున్నాయి. దీంతో జనసేన పార్టీ చీఫ్ లో సంతోషం వ్యక్తం అవుతోంది. ఒకవేళ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కింగ్ పిన్ గా మారడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉండగా ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కేంద్ర జల శక్తి మంత్రి జగేంద్ర సింగ్ షెకవాత్ భేటీ అయ్యారు.