పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు
పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థిగా
అమరావతి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ మంగళవారం పిఠాపురం శాసన సభ నియోజకవర్గం నుంచి జనసేన కూటమి తరపున అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగ బాబు కూడా ఉన్నారు.
నామినేషన్ సందర్బంగా వేలాది మంది తరలి వచ్చారు పవన్ కళ్యాణ్ వెంట. ఎక్కడ చూసినా అభిమాన సంద్రమే కనిపించింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచి పోయాయి. దారి పొడవునా పవన్ కళ్యాణ్ పోస్టర్లు, కటౌట్లతో నిండి పోయింది.
ఎన్నికల నిబంధనల మేరకు 5 మందికి మించి అభ్యర్థితో ఉండ కూడదు. అంతే కాకుండా ఎన్నికల అధికారి కార్యాలయానికి 200 మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపి వుంచాలి. లేకపోతే చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఈసీ స్పష్టం చేసింది.
ఇక నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తాను గెలవడం పక్కా అని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. కూటమి పవర్ లోకి వస్తుందన్నారు. జగన్ ఇంటికి వెళ్లడం తప్పదన్నారు .