23న పవన్ కళ్యాణ్ నామినేషన్
ప్రకటించిన జనసేన పార్టీ
మంగళగిరి – ప్రముఖ నటుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఈనెల 23న పిఠాపురం శాసన సభ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు గాను నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. శాసన సభ ఎన్నికల అధికారికి పవన్ స్వయంగా నామినేషన్ పత్రాలు అందజేస్తారని తెలిపింది.
అదే రోజు ఉప్పాడలో జనసేన కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సమావేశానికి జనసేనాని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొంది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గతంలో కంటే ఈసారి మరింత బలం పుంజుకుంది. ఆక్టోపస్ లాగా అల్లుకు పోయిన జగన్ మోహన్ రెడ్డిని సాగనంపేందుకు కూటమిగా ఏర్పాటు అయ్యాయి పార్టీలు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఈసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఎలాగైనా సరే జగన్ రెడ్డిని , ఆయన పరివారాన్ని ఇంటికి సాగనంపాలని కృత నిశ్చయంతో ఉన్నారు పవన్ కళ్యాణ్.
తాను పిఠాపురం నుంచి గెలుపొందడం ఖాయమని, కూటమి అధికారంలోకి వస్తుందని, ఇక జనరంజకమైన పాలన సాగుతుందన్నారు జనసేనాని.