డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశం
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాబేళ్ల మృతిపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. కాకినాడ తీరం, ఏపీఐఐసీ, వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పెద్ద ఎత్తున చని పోయి ఉండడాన్ని తీవ్రంగా పరిగణించారు.
తక్షణమే వాటి మృతికి గల కారణాలు తనకు తెలియ చేయాలని అటవీ శాఖ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున మరణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ప్రకృతిని కాపాడు కోవడం అన్నది ఒక బాధ్యత కావాలని స్పష్టం చేశారు .
రోజు రోజుకు అరుదైన జంతువులు, జల చరాలు కనిపించకుండా పోతున్నాయని వాపోయారు. వీటిని పరిరక్షించుకునేందుకు ఒక ఉద్యమంగా కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు.