పొట్టి శ్రీరాములు వల్లనే ఏపీ ఏర్పాటు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసుకోవడం వల్లనే ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్దించిందని లేక పోతే వచ్చి ఉండేది కాదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు నిత్య ప్రాతః స్మరణీయుడని కొనియాడారు. ఆయన స్పూర్తి ఆంధ్ర జాతికి దిక్సూచి అన్నారు.
గత ప్రభుత్వం పట్టించు కోలేదని అన్నారు. కానీ తమ కూటమి ప్రభుత్వం వచ్చాక కీలక నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డిసెంబర్ 15న ఆత్మార్పణ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని స్పష్టం చేసిందన్నారు. ఆయన అందించిన స్పూర్తి ఎల్లకాలం ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్ కొణిదల.
ప్రతి ఒక్కరు ఆయనను స్మరించు కోవాలని పిలుపునిచ్చారు . ఆంధ్ర రాష్ట్ర అభివృద్ది కోసం ఎందరో త్యాగాలు చేశారని వారందరినీ పేరు పేరునా తాము తల్చుకుంటున్నామని చెప్పారు ఏపీ డీప్యూట సీఎం. ఈ కార్యక్రమంలో మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, డాక్టర్ పొంగూరు నారాయణ, నిమ్మల రామా నాయుడు, తదితరులు పాల్గొన్నారు.