పిఠాపురంలో పవన్ కళ్యాణ్ టూర్
జూలై 1 నుంచి పర్యటన ప్రారంభం
అమరావతి – ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే తనకు కేటాయించిన ప్రధాన శాఖలపై దృష్టి సారించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. సమీక్ష చేపట్టారు. నిధుల మంజూరుతో పాటు గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై విచారణకు ఆదేశించారు.
ఇదే సమయంలో ఆయన గతంలో ప్రకటించినట్టుగానే ప్రజా దర్బార్ ను స్వయంగా నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ వినతులతో పవన్ కళ్యాణ్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదాలు తెలియ చేసేందుకు రానున్నారు.
జూలై 1 నుంచి మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. జూలై 1న గొల్లప్రోలులో పెన్షన్లు పంపినీ చేస్తారు. అనంతరం జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. 2న కాకినాడ కలెక్టరేట్ లో పంచాయతీ, ఇరిగేషన్, అటవీశాఖ అధికారులతో సమీక్ష చేపడతారు. 3న సాయంత్రం పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు.