ఎంజీఆర్ పై పవన్ కళ్యాణ్ కామెంట్స్
ఆయనతో అనుబంధం మరిచి పోలేను
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం సనాతన ధర్మం గురించి ప్రత్యేకంగా చర్చలు జరుగుతున్న ఈ తరుణంలో ఏఐఎండీకే నేత, దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్.
‘పురచ్చి తలైవర్’, తిరు ‘ఎంజిఆర్’ పట్ల తనకు ఉన్న ప్రేమ, అభిమానం చెన్నైలో తనలో అంతర్భాగంగా ఉందని తెలిపారు. అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం. రాబోయే ‘AIADMK’ ఏఐఎండీకే 53వ ఆవిర్భావ దినోత్సవం ‘అక్టోబర్ 17న’ ‘పురచ్చి తలైవర్’ ఆరాధకులు అభిమానులందరు జరుపుకోనున్నారని పేర్కొన్నారు. వారందరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు.
పురచ్చి తలైవర్‌తో తనకు మొదటి పరిచయం మైలాపూర్‌లో చదువుతున్నప్పుడు తమిళ భాషా ఉపాధ్యాయుడి ద్వారా జరిగిందని స్పష్టంచేశారు పవన్ కల్యాణ్. ‘తిరుక్కరల్’ నుండి ఒక ద్విపదను పఠించాడని అన్నారు. ఈ తిరుక్కురల్‌లో పురచ్చి తలైవర్ లక్షణాలు ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.
పరోపకారము, దయాగుణము, నిష్కపటము, ప్రజల పట్ల శ్రద్ధ ఈ నాలుగు విషయములను కలిగి యున్న వారందరికీ ఆయన వెలుగు లాంటి వారని కొనియాడారు ఏపీ డిప్యూటీ సీఎం.