రేవంత్ రెడ్డి నిర్ణయం పవన్ కళ్యాణ్ హర్షం
హైడ్రా విషయంలో సీఎం చేసింది కరెక్టే
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేయడం విశేషం. సీఎం తీసుకున్న చర్యలను తాను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. వరదలు ముంచెత్తడానికి అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లనేనని ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అద్భుతం అంటూ కొనియాడారు కొణిదల పవన్ కళ్యాణ్.
హైడ్రా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్.. హైడ్రా లాంటి ఒక వ్యవస్థ మంచిదే అని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం.
ఏపీలో ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలి అనేది చర్చిస్తామని అన్నారు.. హైదరాబాద్‌లో ఇళ్లు చెరువుల్లో కట్టేస్తే ఎలా అనుకునే వాడిని.. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వాటిని తొలగిస్తున్నారు..
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగే సమయంలో కఠినంగా ఉండాలి.. అలా కాకుండా కట్టే సమయంలో సైలెంట్ గా ఉంటే ఇబ్బందులు తప్పవు అని హెచ్చరించారు.