NEWSANDHRA PRADESH

మోడీ ప్ర‌స్థానం చ‌రిత్రాత్మ‌కం – ప‌వ‌న్ క‌ళ్యాణ్

Share it with your family & friends

సీఎంగా కొలువు తీరి మోడీకి 23 ఏళ్లు

అమ‌రావ‌తి – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర గురించి. అక్టోబ‌ర్ 7 అత్యంత ప్ర‌త్యేక‌మైన రోజు. స‌రిగ్గా ఇదే రోజు 2001న గుజ‌రాత్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు అత్యంత సాధార‌ణ‌మైన కుటుంబం నుంచి వ‌చ్చిన మోడీ. ఇవాల్టితో 23 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్బంగా మోడీని ప్ర‌త్యేకంగా అభినందించారు ఏపీ డిప్యూటీ సీఎం.

విప్లవాత్మక నిర్ణయాలతో, రూపొందించిన ప్రణాళికలతో కోట్లాది మంది భారతీయుల జీవితాలను మార్చడం ఆరోజు మొదలైందని అన్నారు. ఆయన నాయకత్వంలో భారత దేశం అంతర్జాతీయ స్థాయిలో అన్ని రంగాలలో దూసుకుపోతూ, 3వ అతిపెద్ద ఆర్దిక వ్యవస్థగా ఎదిగే దిశగా పరుగులు పెడుతుందని పేర్కొన్నారు.

మోడీ దశాబ్దాల కాల ప్రజా జీవితం, దేశం పట్ల ఆయనకున్న నిబద్దతకు, ప్రజా సేవ కంటే ఏది ముఖ్యం కాదు అనే ఆయన ఆలోచనలకు, నిదర్శనంగా నిలచిందన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. భారత దేశ వైవిధ్యాన్ని ఆయన సునిశితంగా అర్దం చేసుకునే విధానం , సంక్లిష్టమైన సమస్యలకు కూడా లోతైన అవగాహనతో పరిష్కార మార్గాలను తీసుకు రావడానికి సహాయ ప‌డేలా చేసింద‌న్నారు. ఆయన నాయకత్వం లెక్కలేనంత మంది ప్రజల జీవితాలను అభివృద్ది పథంలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.

23 సంవత్సరాల సుధీర్ఘ ప్రజా జీవితం పూర్తి చేసుకున్న సందర్బంగా నరేంద్ర మోడికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఆయన వేసిన బలమైన పునాది 2047 నాటికి భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారి, ఆయన కలలు కన్న “వికసిత్ భారత్” మనందరం చూస్తామని నమ్ముతున్నానని స్ప‌ష్టం చేశారు.