NEWSANDHRA PRADESH

రామోజీ రావు వ్య‌క్తి కాదు వ్య‌వ‌స్థ

Share it with your family & friends


ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి – ఈనాడు సంస్థ‌ల అధిప‌తి రామోజీ రావు వ్య‌క్తి కాద‌ని ఆయ‌న విస్మ‌రించ లేని వ్య‌వ‌స్థ అని కొనియాడారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల‌. ఇటీవ‌లే అనారోగ్యంతో క‌న్ను మూశారు రామోజీరావు. విజ‌య‌వాడ‌లో రామోజీ రావు సంస్మ‌ర‌ణ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన స‌మావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా రామోజీరావు జీవితం గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఆయ‌న జీవితం ఎంద‌రికో మార్గ‌ద‌ర్శ‌కంగా ఉప‌యోగ ప‌డుతుంద‌న్నారు. ఎక్క‌డో రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు ఇవాళ దేశంలోనే మీడియా రంగంలో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ ను స్వంతం చేసుకునేలా ఎదిగారంటూ ప్ర‌శంసించారు.

గ‌త జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ రామోజీ రావును కావాల‌ని వేధింపుల‌కు గురి చేసింద‌ని ఆవేద‌న చెందారు. కుటుంబాన్ని సైతం ఇబ్బంది పెట్టింద‌ని, అన్నీ త‌ట్టుకుని ధైర్యంగా నిలబ‌డ్డార‌ని, ఏపీ కోసం పోరాటం చేశార‌ని, అమ‌రావ‌తికి త‌న వంతు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని కొనియాడారు.