పవన్ కళ్యాణ్ ప్రజా దర్బార్
ప్రజా సమస్యలతో ఉక్కిరి బిక్కిరి
మంగళగిరి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల దూకుడు పెంచారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే తనకు కేటాయించిన శాఖలపై ఫోకస్ పెట్టారు. ప్రతి రోజూ సమీక్షలు చేస్తూ గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
మరో వైపు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి తనే స్వయంగా వినతులు స్వీకరిస్తున్నారు పవన్ కళ్యాణ్. మంగళగిరి కేంద్ర కార్యాలయానికి సమస్యలతో ప్రజలు పోటెత్తారు. దీంతో ఎక్కడ చూసినా జనమే కనిపించారు.
అయినా ఎక్కడా అలసి పోలేదు జనసేనాని. ఇదిలా ఉండగా ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నుంచి 1143 టీచర్ పోస్టులను మినహాయించాలని గిరిజన సంక్షేమ గురుకాలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోరారు.
ఇప్పటికే ఒప్పంద విధానంలో తాము బోధన చేస్తున్నామని తెలిపారు. 2022 ప్రకారం పీఆర్సీ వచ్చేలా చూడాలని కోరారు. ఇక మెగా డీఎస్సీలోనే డ్రాయింగ్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల నియామకం కూడా చేపట్టాలని విన్నవించారు పవన్ కళ్యాణ్ కు.