హిందువులకు రక్షణ కల్పించండి
వాయిస్ పెంచిన పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన వాయిస్ ను పెంచారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ , ఆఫ్గనిస్తాన్ దేశాలలో నివసిస్తున్న భారత దేశానికి చెందిన హిందువులకు దీపావళి పండుగ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సనాతన ధర్మం కోసం కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం. ఆరు నూరైనా సరే , ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్ , పాకిస్థాన్‌లలో హింసకు గురవుతున్న హిందువుల పట్ల యావత్ ప్రపంచం మాట్లాడాలని , ఎందుకు మౌనంగా ఉందంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ప్రపంచ నాయకులు తమ గొంతు విప్పాలని, అణగారిన హిందువుల గురించి మాట్లాడాలని, వారికి న్యాయం చేయాలని పిలుపునిచ్చారు కొణిదెల పవన్ కళ్యాణ్.
ఇదే సమయంలో హిందువుల కోసం అవసరమైతే తాను ఎంతకైనా తెగిస్తానని, ప్రాణ త్యాగం చేసేందుకు రెడీగా ఉన్నానని సంచలన ప్రకటన చేశారు. కాగా అల్బెలో ఇండియా పేరుతో పాకిస్తాన్ కు చెందిన పిల్లవాడు పాడిన సింధీ పాటకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్.