NEWSANDHRA PRADESH

బెంగ‌ళూరుకు చేరుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్

Share it with your family & friends

ఘ‌న స్వాగ‌తం ప‌లికిన ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు

బెంగ‌ళూరు – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురువారం బెంగ‌ళూరుకు చేరుకున్నారు. ఆయ‌న డిప్యూటీ సీఎంగా కొలువు తీరిన త‌ర్వాత తొలిసారి క‌ర్ణాట‌క రాష్ట్రాన్ని సంద‌ర్శించ‌డం. ప్ర‌స్తుతం అటవీ శాఖ‌తో పాటు ప‌లు కీల‌క శాఖ‌ల‌ను త‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో అటవీ శాఖ విధానాల‌పై ఇటీవ‌లే స‌మీక్ష చేప‌ట్టారు. కీల‌క మార్పులు తీసుకు రావాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇందులో భాగంగా ఇవాళ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంతో చ‌ర్చించేందుకు అక్క‌డికి చేరుకున్నారు . ప్ర‌ధానంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వంతో వ‌న్య ప్రాణి, అటవీ సంర‌క్ష‌ణ అంశాల‌ను ప్ర‌స్తావించ‌నున్నారు. బెంగ‌ళూరుకు చేరుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు క‌ర్ణాట‌క రాష్ట్ర బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ సుధీంద్ర, బోర్డు సలహాదారు భరత్ సుబ్రహ్మణ్యం స్వాగతం పలికారు.

అనంత‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ర్ణాట‌క రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖంద్రే గారితో చర్చలు జ‌రిపారు. చిత్తూరు జిల్లా పరిధిలోను, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. ప్రాణ హాని కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు కావాల్సిన అవ‌స‌రం ఉంది.

కుంకి ఏనుగులు ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క వ‌ద్ద ఉన్నాయి. వాటిని మ‌న రాష్ట్రానికి తీసుకు రావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు డిప్యూటీ సీఎం.