సాహిత్యం పవన్ కల్యాణ్ కు ప్రాణం
పుస్తకాలంటే వల్లమాలిన అభిమానం
హైదరాబాద్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వ్యక్తిగతంగా అంతర్ముఖుడు. కానీ తనకు చిన్నతనం నుంచే పుస్తకాలంటే వల్లమాలిన అభిమానం. అంతకంటే పిచ్చి కూడా. ఓ వైపు షూటింగ్ లలో బిజీగా ఉన్నా ఏ మాత్రం కాస్తంత సమయం చిక్కితే చాలు పుస్తకాలను చదవడంపై ఆసక్తి చూపిస్తారు.
ఆయనకు గుంటూరు శేషేంద్ర శర్మ అంటే విపరీతమైన అభిమానం. ఆయనతో పాటు జాషువా రాసిన గబ్బిలం గురించి చాలా సార్లు చాలా చోట్ల ఉదహరించారు. పవన్ కళ్యాణ్ వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలను ఎక్కువగా ఇష్ట పడతారు. ఎక్కడ మంచి పుస్తకం కనిపించినా లేదా నెట్ లో దొరికినా వెంటనే తెప్పించుకుంటారు.
పుస్తకాలతో పాటు ప్రకృతి వ్యవసాయం అన్నా చాలా ఇష్టం. షూటింగ్ లు అయి పోయాక తనకు ఇష్టమైన వ్యక్తులతో , దర్శకులతో సంభాషిస్తారు. ప్రత్యేకించి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎక్కువ చనువు.
అన్ని రకాల సాహిత్యాన్ని చదవడం, తనకు నచ్చిన రచయితలు రాసిన గొప్ప గొప్ప వ్యాక్యలను , కోట్స్ ను ఉదహరించడం చేస్తుంటారు పవన్ కళ్యాణ్. ఎవరైనా సరే తనకు సన్మానాలు చేయొద్దని పిల్లలకు చదువుకునేందుకు పుస్తకాలను ఇవ్వాలని ఆ మధ్యన ప్రకటించారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఆలోచనా పరుడు..అంతకు మించిన సహృదయుడు.