సమాజ హితం అత్యంత అవసరం
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్
విజయవాడ – సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులలో కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు కీలకమైన పాత్ర పోషిస్తారని స్పష్టం చేశారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. విజయవాడలో ప్రముఖ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తక ఆవిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నాదెండ్ల మనోహర్ , తదితర ప్రముఖులు పాల్గొన్నారు. విధ్వంసం పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. తొలి ప్రతిని పవన్ కళ్యాణకు అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు ఆలపాటిని అభినందనలతో ముంచెత్తారు నారా చంద్రబాబు నాయుడు.
సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు జనసేన పార్టీ చీఫ్. కళాకారులు లేక పోతే ఈ ప్రపంచం లేదన్నారు. జర్నలిస్టుగా లబ్ద ప్రతిష్టులైన ఆలపాటి సురేష్ కుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. మొత్తంగా ఈ విధ్వంసం పుస్తకం వేలాది మందికి మార్గదర్శకంగా ఉంటుందనడంలో సందేహం లేదన్నారు.