దూకుడు పెంచిన పవన్
అటవీ శాఖపై సమీక్ష
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. సచివాలయంలోని 2వ బ్లాక్ లోని 211వ గదిలో ఆసీనులయ్యారు. ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ మిశ్రా.
అంతకు ముందు పవన్ కళ్యాణ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. కొద్ది సేపు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. అక్కడి నుంచి తనకు కేటాయించిన శాఖలకు సంబంధించి ఆరా తీశారు.
కీలకమైన శాఖలు పవన్ కళ్యాణ్ కు దక్కాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో తనే కీలకంగా వ్యవహరించారు. దీంతో కేంద్రంలో చక్రం తిప్పుతున్న హోం శాఖ మంత్రి అమిత్ షా ఇక్కడ కూడా కీ రోల్ పోషించారు. ఇది పక్కన పెడితే ఇవాళ అటవీ శాఖపై సమీక్ష చేపట్టారు పవన్ కళ్యాణ్.
ప్రజలకు మేలు చేకూర్చేలా పనితీరు ఉండాలని స్పష్టం చేశారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఇతర శాఖలపై కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టనున్నారు.