Monday, April 21, 2025
HomeNEWSANDHRA PRADESHహ‌స్త‌క‌ళల అభివృద్దికి స‌ర్కార్ పెద్ద‌పీట

హ‌స్త‌క‌ళల అభివృద్దికి స‌ర్కార్ పెద్ద‌పీట


స‌మ‌గ్ర‌మైన ప్ర‌ణాళిక త‌యారు చేస్తాం

అమ‌రావ‌తి – ఏపీ ఉప ముఖ్య‌మంత్రి కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ హస్తకళా సాంప్రదాయాలను కాపాడు కోవడానికి సమగ్రమైన ప్రణాళిక త‌యారు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

కొండపల్లి, ఏటికొప్పాక, బొబ్బిలి బొమ్మలతో ముడిపడి ఉన్న ప్రత్యేకమైన హస్తకళల ప్రాముఖ్యత, కళాకారులు ఎదుర్కుంటున్న సమస్యలు, ఆ కళలను కాపాడు కోవడానికి చేపట్టాల్సిన చర్యల గురించి ఉప ముఖ్యమంత్రి కీల‌క సూచ‌న‌లు చేశారు.

అధిక దోపిడీ, నిర్వహణ లోపం వల్ల కళాకారులు సాంప్రదాయకంగా ఉపయోగించే వనరులైన అంకుడు , తెల్ల పొలికి (గివోటియా మొలుక్కనా) కలప వాటి సహజ ఆవాసాలలో బాగా తగ్గుముఖం పట్టాయని ఉపముఖ్యమంత్రి గుర్తించారు.

ఈ కొరత చాలా మంది కళాకారుల జీవనోపాధికి ముప్పు తెచ్చిపెట్టిందని, దానివల్ల ఈ కళారూపాల నిరంతర ఉత్పత్తికి ప్రమాదం ఏర్పడిందన్న విష‌యం త‌న దృష్టికి వ‌చ్చింద‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల‌.

వనరుల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఉప ముఖ్యమంత్రి సమగ్ర ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా అటవీ శాఖ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS) సహకారంతో, రాష్ట్ర వ్యాప్తంగా అడవులు , ప్రభుత్వ నర్సరీలలో అంకుడు, తెల్ల పొలికి, స్థానికంగా ముఖ్యమైన ఇతర జాతులను తిరిగి ప్రవేశ పెట్టడానికి విస్తృతమైన ప్లాంటేషన్ కార్యక్రమాలు చేపట్టాల‌ని ఆదేశించారు .

ఆంధ్రప్రదేశ్ హస్తకళలను కాపాడుకునే ప్రయత్నంలో స్థానిక కమ్యూనిటీలు, కళాకారులు , స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను సాంప్రదాయ కళారూపాల రక్షణకు ఒక నమూనా రాష్ట్రంగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments