NEWSANDHRA PRADESH

బ‌డుల స్థ‌లాలు క‌బ్జా చేస్తే కేసులు

Share it with your family & friends

ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి – పాఠశాలలు, ప్రభుత్వ ఆస్తుల కబ్జాకు పాల్పడే వ్యక్తులపై గూండా యాక్ట్ కింద కేసులు పెడతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కడప జిల్లాలో పాఠశాలల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్ధులకు సరైన చదువు ఇవ్వకపోతే సమాజం అభివృద్ధి చెందదన్నారు. పాఠశాలలు, విద్యార్ధుల సమస్యల పరిష్కారం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు.

ప్రభుత్వం వద్ద నిధులు లేకున్నా మనస్సు పెద్దదని, తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి దారులు వెతుకుతున్నామని చెప్పారు. శనివారం కడప నగరంలోని మద్రాస్ రోడ్డులోని మున్సిపల్ కార్పోరేషన్ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్ధులతో ముఖాముఖి సమావేశం అయ్యారు.

పాఠశాలలోని వంటశాల నవీకరణకు నిధుల కొరత ఉందన్న విషయం జిల్లా కలెక్టర్ ద్వారా తెలుసుకుని, అందుకు అయ్యే ఖర్చు మొత్తం తన సొంత ట్రస్ట్ నుంచి అందజేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 44 వేల పాఠశాలల్లో కోటి మంది విద్యార్ధులు, తల్లిదండ్రులు పాల్గొనేలా ప్ర‌భుత్వం మెగా టీచ‌ర్స్ , పేరెంట్స్ మీటింగ్ నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలోనే అత్యధిక గ్రంథాలయాలతో వెలసిల్లిన ప్రాంతం క‌డ‌ప అన్నారు.

అన్నమయ్య, వేమన, మొల్ల, పుట్టపర్తి నారాయణాచార్యులు, కేవీరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయులు పుట్టిన నేల అని కొనియాడారు. రాయలసీమ అంటే వెనుకబాటు కాదు. అవకాశాలను ముందుండి నడిపించే ప్రాంతం అన్నారు. . ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తెస్తామ‌న్నారు.