వన్య ప్రాణుల పరిరక్షణ అందరి బాధ్యత
స్పష్టం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్
అమరావతి – వన్య ప్రాణులు రోజు రోజుకు అంతరించి పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల. సోమవారం మంగళగిరి అరణ్య భవన్ లో ఆంధ్రప్రేదశ్ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పవన్ కళ్యాణ్ కొణిదెల. ఈ సందర్బంగా అటవీ, పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ప్రత్యేకంగా అభినందించారు ఏపీ డిప్యూటీ సీఎం.
వారికి పలు సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వన్య ప్రాణుల విశిష్టత గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందు కోసం క్యాంపెయిన్ చేపట్టాలని పేర్కొన్నారు. స్టాల్స్ ను పరిశీలించిన అనంతరం పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
అడవులతో పాటు వన్య ప్రాణులు కూడా అత్యంత ముఖ్యమని, వాటిని కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ కొణిదెల. తమ కూటమి ప్రభుత్వం అటవీ సంరక్షణ, వన్య ప్రాణులను కాపాడేందుకు కంకణం కట్టుకుందన్నారు.