ప్రకటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల తర్వాత అంతటి శక్తి ఉన్న క్షేత్రం ఐఎస్ జగన్నాథపురంలోని శ్రీ లక్ష్మినరసింహ క్షేత్రం అని అన్నారు. 2009లో ప్రజారాజ్యం ఓటమి తర్వాత ఒంటరిగా ఉండి పోయిన సమయంలో తాను ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు తెలిపారు.
త్రేతాయుగంలో స్వయంభుగా శ్రీ లక్షినరసింహ స్వామి వెలిసిన క్షేత్రంగా దీనికి ప్రసిద్ధి చెందిందన్నారు.
స్వామిని తాను అప్పట్లో ఒకటే కోరుకున్నానని తెలిపారు. స్వామి… ప్రజల కోసం బలంగా పనిచేసే శక్తినివ్వు అని కోరానని చెప్పారు.
ఆ కోరికను స్వామి 14 ఏళ్ల తర్వాత తీర్చారు. ఎంతో శక్తివంతమైన స్వామి కొలువు దీరిన ప్రాంతంగా ఉన్న ఈ క్షేత్రం సమగ్ర అభివృద్ధి కోసం దృష్టి పెడతానని అన్నారు. ఈ క్షేత్ర మహిమ, ప్రాధాన్యం గురించి ప్రచారం కల్పించడమే కాకుండా ఆలయానికి ఉన్న 50 ఎకరాల భూ వివాదాన్ని పరిష్కరించేలా అధికారులతో మాట్లాడుతామన్నారు.
దేవాదాయ శాఖకు ఆలయ భూమి తిరిగి వస్తే, ఇక్కడ భక్తులకు అవసరం అయ్యే కాటేజీలు, ఇతర హోటళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. దీంతో క్షేత్రానికి భక్తుల రాక పెరుగుతుందని, దానివల్ల స్థానికులకు ఉపాధి పెరుగుతుందన్నది తన ఆలోచన అని అన్నారు.