బొకేలు..శాలువాలు వద్దు
ప్రకటించిన పవన్ కళ్యాణ్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొణిదెల పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తాను ప్రజల మనిషినని మరోసారి నిరూపించారు. తనకు సన్మానాలు, శాలువాలు, బొకేలు వద్దని ప్రకటించారు. వీటికి అయ్యే ఖర్చుతో పేదలకు అన్నం పెట్టండని సూచించారు. పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలని సూచించారు.
ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎంగా కొలువు తీరిన పవన్ కళ్యాణ్ ను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలతో ముంచత్తారు. త్వరలోనే జిల్లాల వారీగా తాను కలుస్తానని తెలిపారు డిప్యూటీ సీఎం. నారా చంద్రబాబు నాయుడు కీలక శాఖలను ఆయనకు అప్పగించారు.
తనను ఆదరించి అక్కున చేర్చుకున్న పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించినందుకు రుణపడి ఉన్నానని అన్నారు పవన్ కళ్యాణ్. ఈనెల 20వ తేదీన తాను పిఠాపురం వస్తానని , కార్యకర్తలను కలుసుకుంటానని చెప్పారు.