రోడ్ల నిర్మాణం అభివృద్దికి సోపానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – తమ ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి ప్రయారిటీ ఇస్తోందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖ నుంచి పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనకు వెళ్లారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోయినా ముందుగా నిర్ణయించిన ప్రకారం ముందుకే వెళ్లాలని నిర్ణయించారు.
ఈ మేరకు గిరిజన గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టనున్నారు పవన్ కల్యాణ్. 19 నూతన రోడ్లకు శంకుస్థాపనలు చేస్తారు. దాదాపు 36.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ. మేర నూతన రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
రోడ్ల నిర్మాణంతో 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి డొలీల బాధల నుండి విముక్తి లభిస్తుందన్నారు. కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందన్నారు. గత వైసీపీ జగన్ రెడ్డి ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను పట్టించు కోలేదని ఆరోపించారు. తాము వచ్చాక విజన్ ను తయారు చేయడం జరిగిందన్నారు.
ఆ మేరకు రహదారులతో పాటు భవనాలను, ఇతర అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ కొణిదల.