పిఠాపురంలోనే ఉంటా – పవన్
అభివృద్ది ఏమిటో చూపిస్తా
అమరావతి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆయన పదే పదే అనారోగ్యానికి గురవుతూ వచ్చారు. తీవ్రమైన జ్వరం నుంచి కోలుకున్న పవన్ కళ్యాణ్ బుధవారం జనంలోకి వచ్చేశారు. ఈ సందర్బంగా పిఠాపురంపై ఫోకస్ పెట్టారు. ఈసారి జరగబోయే శాసన సభ ఎన్నికల్లో తను ఇక్కడి నుంచే ఎమ్మెల్యే బరిలో నిలిచారు.
పవన్ కళ్యాణ్ కు పోటీగా వైసీపీ నుంచి వంగా గీత పోటీలో ఉన్నారు. ఇక్కడ పోరు రసవత్తరంగా మారింది. రాష్ట్రమంతటా ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సర్వే సంస్థలన్నీ గంప గుత్తగా టీడీపీ కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయని జోష్యం చెబుతున్నాయి. ఈ తరుణంలో జనసేన పార్టీ పలు సీట్లను పొత్తులో భాగంగా కోల్పోయింది.
ఇందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర , ప్రజల ప్రయోజనాల కోసం జనసేన త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు. ఇదిలా ఉండగా ఇవాళ స్థానికులతో ముచ్చటించారు. వారి సమస్యలను దగ్గరుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. ఈ సందర్బంగా తాను పిఠాపురంలోనే ఉంటానని, అభివృద్ది అంటే ఏమిటో చేసి చూపిస్తానని ప్రకటించారు.