Wednesday, April 9, 2025
HomeNEWSANDHRA PRADESHరేయింబ‌వ‌ళ్లు గిరిజ‌నుల కోసం ప‌ని చేస్తా

రేయింబ‌వ‌ళ్లు గిరిజ‌నుల కోసం ప‌ని చేస్తా

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా – తాను ఇచ్చిన మాట త‌ప్ప‌న‌ని, గిరి పుత్రుల కోసం రేయింబ‌వ‌ళ్లు ప‌ని చేస్తాన‌ని అన్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. మూడు దశల్లో ఏజెన్సీ ప్రాంతాల రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తామ‌న్నారు. ప‌ర్యాట‌క ప్రాంతంగా మ‌న్యం ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు కూట‌మి స‌ర్కార్ ప్లాన్ చేస్తోంద‌ని, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామ‌ని అన్నారు. గిరిజనుల వెతలు స్వయంగా తెలుసుకొనేందుకే కొండపైకి నడిచి వెళ్ళానని చెప్పారు.

గత ప్రభుత్వంలో గిరిజనుల కోసం ఒక్క పని చేసింది లేదన్నారు. రూ.500 కోట్లతో ఋషికొండ ప్యాలెస్ కట్టారు గానీ గిరిజన గ్రామాలకు కనీసం రోడ్డు కూడా వేయలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అప్పులు, తాకట్టులతో ప్రజాధనం వృథా చేశారన్నారు.

దేశానికి స్వేచ్ఛ ల‌భించి 75 ఏళ్ల‌వుతోంది. కానీ ఇంకా నేటికీ గిరిజ‌నుల బ‌తుకులు మార‌లేద‌న్నారు. తాను వీరి ప‌రిస్థితిని చూసి బాధ క‌లుగుతోంద‌ని వాపోయారు డిప్యూటీ సీఎం. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ నిరక్ష్యరాస్యత, పేదరికం, ఆకలికేకలు, అనారోగ్యం వంటి అంశాలు పట్టి పీడుస్తున్నాయన్నారు. మనసుంటే మార్గం ఉంటుంది. అడవి, కొండలను నమ్ముకొని జీవించే గిరిపుత్రుల కష్టాలు తీర్చాలనే ఆలోచన ఉంటే కచ్చితంగా ఏదో ఒక మార్గం కనిపిస్తుంద‌న్నారు.

రాష్ట్ర విభజన చట్టంలో వెనుకబడిన గ్రామాలకు సంబంధించి తీసుకొచ్చిన రూ. 690 కోట్లు ఎక్కడికి వెళ్లాయో తెలియదన్నారు. ఏనాడు గిరిజన ప్రాంతాల్లో ఒక్కసారి కూడా గత పాలకులు సందర్శించిన పాపాన పోలేద‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments