జనసేన జెండా ఎగరాలి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
మంగళగిరి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ త్వరలో జరిగే ఎన్నికల్లో జనసేన కూటమి జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. పార్టీ పరంగా కీలకమైన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, శ్రేయోభిలాషులు ఈ విషయాన్ని గుర్తించి ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. లేక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉందన్నారు పవన్ కళ్యాణ్.
పలువురు జనసేన పార్టీ చీఫ్ ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా వారిని ఉద్దేశించి ప్రసంగించారు జనసేన పార్టీ చీఫ్. త్వరలో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల కంటే ఎక్కువ స్థానాలు సాధించాలని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు అందజేసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు పవన్ కళ్యాణ్.
రాష్ట్రంలో కక్ష సాధింపులకు పాల్పడటం, అరాచకాలను సృష్టించడమే పనిగా పెట్టుకున్న జగన్ మోహన్ రెడ్డిని ఢీకొన బోతున్నామని ఈ సమయంలో అప్రమత్తంగా ఉండడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఏ విధమైన ఒత్తిళ్లు వచ్చినా వెంటనే కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకు రావాలని అన్నారు పవన్ కళ్యాణ్.