NEWSANDHRA PRADESH

గెలుపు ఖాయం అధికారం త‌థ్యం

Share it with your family & friends

జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ కూట‌మి గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని, త‌మ‌కు 175 సీట్ల‌కు గాను 170 సీట్ల‌కు పైగా వ‌స్తాయ‌ని జోష్యం చెప్పారు. శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రం సంద‌ర్బంగా జ‌న‌సేన పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంగ‌ళవారం ఉగాది ప‌ర్వ‌దినం వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.

అనారోగ్యం కార‌ణంగా తాను ప్ర‌చారం చేప‌ట్ట‌లేక పోయాన‌ని పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే తిరిగి వారాహి విజ‌య యాత్ర చేప‌డ‌తాన‌ని ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇక నిన్న‌టి దాకా అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేట్రేగి పోయిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి, ఆయ‌న ప‌రివారానికి ఓట‌మి త‌ప్ప‌ద‌న్నారు.

పిఠాపురం నుండే తొలి విజ‌యం కూట‌మి అందుకో బోతోంద‌ని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఇక దేశ వ్యాప్తంగా మీడియా సంస్థ‌ల‌న్నీ గంప గుత్త‌గా ఎన్డీయే కూట‌మి విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయ‌ని తెలిపారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఇచ్చిన హామీల‌ను అన్నింటిని త‌ప్ప‌కుండా నెర‌వేరుస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌ని స్ప‌ష్టం చేశారు.